మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆంధ్ర జైత్రయాత్ర

41 నిమిషాల క్రితం

పుదుచ్చేరిపై మూడు వికెట్ల తేడాతో గెలుపు   సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పుదుచ్చేరిపై మూడు వికెట్ల తేడాతో గెలుపు

  • సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ

మొహాలీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మొహాలీ స్టేడియంలో మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అమన్‌ హకీమ్‌(63) అర్ధసెంచరీకి తోడు గౌతమ్‌ శాస్ర్తి(28), భాను ఆనంద్‌(20) బ్యాటింగ్‌లో రాణించారు. ఆంధ్ర బౌలర్లు సత్యనారాయణ రాజు(3/29), సౌరభ్‌ కుమార్‌(3/32), యశ్వంత్‌(2/15) బౌలింగ్‌లో రాణించారు. పుదుచ్చేరి 11.3ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 77 పరుగులతో పటిష్టంగా ఉన్న దశలో ఆంధ్ర బౌలర్లు కట్టడి చేశారు. అనంతరం ఆంధ్ర బ్యాటర్లు అశ్విన్‌ హెబ్బర్‌(63నాటౌట్‌), రషీద్‌(20), కెప్టెన్‌ రికీ బుయ్‌(18) బ్యాటింగ్‌లో రాణించారు. పుదుచ్చేరి బౌలర్లు ఆకాశ్‌కు మూడు, ఆదిల్‌, బాదల్‌, సాగర్‌ ఒక్కో వికెట్‌తో రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అశ్విన్‌ హెబ్బర్‌కు లభించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్