ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకుని లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, ఫార్మా, హెల్త్‌కేర్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలకు ఊరట లభించింది.
సెన్సెక్స్ ఉదయం 72,990.04 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న ఈ సూచీ 482.92 పాయింట్లు పెరిగి 73,606.75 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 153.20 పాయింట్లు లాభపడి 22,753.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.19గా నమోదైంది.
సెన్సెక్స్‌లోని 30 ప్రధాన కంపెనీల్లో అదానీ పోర్ట్స్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, టాటా స్టీల్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అయితే బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,018 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.








కామెంట్‌లు (0)