ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​బిర్సా ముండా జయంతి

3 గంటల క్రితం

​బిర్సా ముండా జయంతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 06:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : స్థానిక ఎజిహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం బిర్సా ముండా 151వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్. జ్యోతి మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ, స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఎం.ఇందిరా ప్రియదర్శిని, సిబ్బంది ఆంజనేయ స్వామి రెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హాస్టల్ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్