ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 218 నామినేషన్లు

3 గంటల క్రితం

kkd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 06:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 66 వార్డులకు 211, మేయర్ పదవికి 7 నామినేషన్లు దాఖలు

- వార్డుల్లో వైసీపీ నుంచి 56, టీడీపీ నుంచి 65.. మేయర్ పదవికి వైసీపీ 2, జనసేన 3

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా ఈ నెల 15వ తేదీ నాటికి మొత్తం 218 నామినేషన్లు దాఖలయ్యాయని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ (ఎఫ్‌ఏసీ) ఎన్ వి వి సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. వీటిలో 66 డివిజన్లకు సంబంధించి 211 నామినేషన్లు, మేయర్ పదవికి ఏడు నామినేషన్లు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే వార్డులకు సంబంధించి 173 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల వారీగా రాజకీయ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధికంగా 65, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 56, జనసేన నుంచి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 7, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నుంచి ఒక్కొక్కటి, ఇతర పార్టీల నుంచి 2 నామినేషన్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మేయర్ పదవికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు, జనసేన నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి ఒకటి, ఇతర పార్టీల తరఫున (తెలుగు నవ గర్జన) ఒక నామినేషన్ దాఖలైంది. బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీడీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి మేయర్ పదవికి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ (ఎఫ్‌ఏసీ) సత్యనారాయణ ఆ ప్రకటన లో తెలిపారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్