అడవిలోన ఉండెను
ఎన్నెన్నో జంతువులు
మురిపెంగ కలిసిమెలిసి
జీవిస్తూ ఉండెను
చెట్ల పైన ఉండెను
ఎన్నెన్నో పిట్టలు
ముచ్చటైన గూళ్లు కట్టి
అందంగా ఉండెను
రామచిలకలేమో
పలుకులెన్నో పలుకును
ఆకుపచ్చ రంగులో
అందంగా ఉండెను
ఎర్రముక్కుతోని
అన్ని పండ్లు తినును
నెమలి పక్షి చూడాలే
ఉన్న కనులు చాలవు
పురివిప్పి ఆడుతుంటే
పుడమి పులకరించును
చెట్ల పైన కోయిల
కుహు మంటూ కూయును
పాటలతో పలువురిని
విందు చేయుచుండును
అడవిలోని అందము
ఎంతో హాయి నిచ్చును
చూసినోళ్లందరికీ
సంతోషం కలుగును!
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655







కామెంట్‌లు (0)