mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దురాశ

1 గంట క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అదిగో మండే వేసవి కాలం

అల్లాడింది ప్రతి ఒక ప్రాణం

ఓ తాబేలు నీటిని వెతుకుచు

మెల్లమెల్లగా చేసె ప్రయాణం!


దారిలోన ఒక కప్పను కలిసెను

తోడు దొరికెనని ఎంతో మురిసెను

రెండూ కలసి చెరువును చేరెను

హాయిగ నీటిలో జలకాలాడెను


ఎండాకాలం అప్పుడే ముగిసెను

మబ్బులు నింగిన నల్లగ ముసిరెను

వాతావరణం చల్లగ మారెను

వాన జోరుగా అప్పుడే కురిసెను


చెరువులోన ఉన్న ఓ చిరుచేప

వీరిద్దరితో స్నేహం కోరెను

ముగ్గురు కలసి ముచ్చటలాడుచు

హాయిగ కాలం గడుపుతూ ఉండెను


ఓ రోజున కప్పా తాబేలు

మాటలాడుకొనుచున్నవి అచట

భూమి మీది అందాల విశేషాలు

నెమరు వేసుకొనుచున్నవి ముచ్చట


అప్పుడే అటుగా వచ్చిన చేప

మిత్రుల మాటలు వినడము జరిగెను

భూమి పైన అందాలను చూసే

భాగ్యము లేదని బాధను పడెను


దిగులుతో ఉన్న చేపను చూసి

తాబేలప్పుడు ప్రేమగా పలికెను

దిగులు పడకుమా ఓ చిరు చేప

నా వీపున నిన్ను మోసుకుపోతా


ఆనందంతో చెరువులో చేప

పిల్లిమొగ్గలే ఎన్నో వేసెను

జామ్ జామ్మని తాబేలు వీపున

సంతోషంగా వచ్చి కూర్చొనెను


ఎగిరెను ఎగిరెను కప్పమ్మ

గట్టు పైకి తా చేరిందమ్మ

కదిలెను కదిలెను తాబేలమ్మ

మెల్లమెల్లగా కదిలేనమ్మ


తాబేలు వీపున ఉన్నట్టి చేప

ఆతృతతో తా చుట్టూ చూసెను

రకరకాల చెట్లు, రంగుల పూలను

పరవశంతో తను పరికించెను


ముగ్గురు మిత్రులు ఆనందంగా

ముందుకు సాగుతూ ఉన్నారు

కమఠం పైన ఉన్నట్టి చేపకు

కాళ్లూ చేతులూ లాగుతూ ఉన్నవి


గాలి పీల్చడం కష్టము కాగా

చేప గిలగిలా కొట్టుకొన్నది

అనునుగాని ఆ చోటుకి చేరి

అసువులు పాపం వదిలేసింది!


- దాసరి చంద్రయ్య

సూళ్లూరుపేట

94404 07381


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్