mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఇల్లాలే జాతి నిర్మాత’

1 గంట క్రితం

supreme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సుప్రీం కోర్టు ఇటీవల ఇల్లాలి ఘనతను చాటేలా తీర్పు వెలువరించింది. పంజాబ్ లో 2001 లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఓ గృహిణికి రావాల్సిన పరిహారం విషయమై కేసు నడవగా, తుది తీర్పులో ఆమె ప్రాముఖ్యతను ఎలా చూడాలో చెప్తూ సమాజానికి దిశానిర్దేశం చేసింది. పరిహారం లెక్క కట్టేటప్పుడు ఆమెను కేవలం ఇంటిని చూసుకునే ఇల్లాలిగా పరిగణించడం తప్పు అన్నది సారాంశం. ఇంట్లో భర్త సంపాదనపై బ్రతికే మనిషిగా చూడడం అన్యాయమని, ఆమెని చూడాల్సింది ఇంటిని నిలబెట్టే మూలాధారంగా అని నొక్కి చెప్పింది. ఆమె చేసే చాకిరీ, సేవలు వెలకట్టలేనివి. అవి లేకుంటే ఇంట్లో వారి పనితీరు ప్రభావితమై, జాతి సంపదకు నష్టం వాటిల్లుతుంది. పరోక్షంగా ఆ కుటుంబమే కాకుండా దేశం ఆర్థికంగా నష్టపోతుంది కనుక ఇల్లాలి ఇంటి పనికి ఖరీదు కట్టాల్సిందేనంటూ చెప్పింది. ప్రస్తుతానికి ఆ సేవల్ని డొమెస్టిక్ వాల్యూగా లెక్కించి కనీసంగా నెలకు 30 వేల రూపాయలుగా నిర్ణయించింది. ఒక వేళ ఆమె ఏదైనా ఉద్యోగంలో ఉంటే, ఇలాంటి నష్ట పరిహారాలు లెక్కించేటప్పుడు తన జీతానికి అదనంగా డొమెస్టిక్ వాల్యూ అంటే నెలకు 30 వేల రూపాయలు కూడా కలిపి లెక్కించాలని తీర్పు చెప్పింది. మంచి తీర్పు. సాధారణ గృహిణిని భర్త సంపాదన మీద బ్రతికే మనిషిగా చూడడం అలవాటైపోయింది. ఆమె చేస్తున్న సేవల్ని ఆర్థికంగా గణించడం జరగడం లేదు. ఆ సేవల్ని ఆర్థిక కోణంలో చూస్తే దేశపు జిడిపి లో 11 శాతానికి తక్కువ ఉండదని అంచనా. అంత చేసినా కుటుంబంలో, సమాజంలో కనీస గుర్తింపుకు నోచుకోని పాత్రధారిగా మిగిలిపోతుంది. వాస్తవానికి ఆమే జాతి నిర్మాణానికి ఆధారం. ఆ విషయాన్ని కోర్టు తన తీర్పు ద్వారా బలంగా తెలియజేసింది. మహిళ పాత్రని పురోగామి కోణంలో చూడడానికి, తగిన గౌరవం కల్పించడానికి ఈ తీర్పు మరో మెట్టు కాగలదు.

- డా.డి.వి. జి. శంకరరావు,

మాజీ ఎంపీ, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్