ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 (ఆదివారం) రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 0-5 ఏళ్ల వయసున్న 49,20,239 మంది చిన్నారులకు బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ రెండు చుక్కలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు. 29,873 పోలియో బూత్‌లు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ టీమ్‌లు, 1,144 ట్రాన్సిట్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 1.31 లక్షల మంది సిబ్బందిని రంగంలోకి దించామని, 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను జిల్లాలకు పంపిణీ చేశామని వెల్లడించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యత తీసుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 28న బూత్‌లలో, 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే, మాప్-అప్ కార్యక్రమం ఉంటుందని, టీకా వేసిన ఇళ్లకు ‘పి’, మిస్ అయిన ఇళ్లకు ‘ఎక్స్’ మార్క్ వేసి అవసరమైతే మరోసారి ఇళ్లకు వెడతారని తెలిపారు.
Print Editionరేపు పల్స్‌పోలియో
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 01:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)