mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు

1 గంట క్రితం

union cabinet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 01:13 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- కొంత మంది ఔట్…

-
కొంత మంది శాఖలు మార్పు

- కొన్ని కొత్త ముఖాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో ఏదొక రోజు కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గురువారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. నీట్ నిర్వహణలో విఫలం అయిన ధర్మేంద్ర ప్రధాన్, కుమారుడి ఫోక్సో కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్, ఇంధన నిర్వహణలో విఫలం అయిన హర్దీప్ సింగ్ పురిలను ఇంటికి పంపిస్తారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే కొత్త మంత్రివర్గంలోకి రిజర్వుబ్యాంకు (ఆర్‌‌బిఐ) మాజీ గవర్నర్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తి కాంత దాస్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ శాఖ మారుస్తారనే ప్రచారం సాగు తోంది. ఆమెకు విద్యాశాఖ కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను మళ్లీ మంత్రివ ర్గంలోకి తీసుకుంటారు. ఎన్‌డిఏకు మద్దతు ఇచ్చిన శివసేనకు ఈ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ ఎంపి శ్రీకాంత్ షిండేకు మంత్రి పదవి లభించనుంది.

కొత్త మంత్రుల జాబితాలో ఎంపిలు అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు నిశిత పర్యవేక్షణలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, కుల సమీకరణాలు, బ్రాహ్మణుల ప్రాతినిధ్యాన్ని పెంచడం వంటి అంశాలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. పంజాబ్, బెంగాల్ పై కూడా మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. ఢిల్లీ బిజెపి అధ్యక్షులుగా నియమితులైన హర్ష్ మల్హోత్రా, రోడ్డు రవాణా, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా అదే రూపంలో కొనసాగే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షులుగా నియమితులైన పంకజ్ చౌదరి కూడా పార్టీ పనిపై పూర్తి దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి వైదొలగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఆయనను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది. బిజెపి రవ్‌నీత్ సింగ్ బిట్టును రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో, ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. రవ్‌నీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్‌కు స్థానం కల్పించనున్నారు. లోక్ సభ సభ్యులు కమల్బీత్ సెహ్రావత్, రాజ్యసభ సభ్యులు సత్నామ్ సింగ్ సంధు వంటి పేర్లు చేర్చుకునే అవకాశాలపై చర్చల్లో వినిపించాయి. పంజాబ్ మాజీ బిజెపి అధ్యక్షులు సునీల్ జాఖర్ కేంద్ర మంత్రివర్గంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి ప్రతాప్‌ రావు జాదవ్‌తోపాటు మనోహర్ లాల్ ఖట్టర్ శాఖలు మార్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, హర్దీప్ సింగ్ పూరీతోపాటు అరడజను మంది సహాయ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో ఇటీవలే కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు టిఎంసి నుంచి 20 మంది, శివసేన (ఠాక్రే) నుంచి ఆరు మంది ఎంపిలు ఎన్‌డిఏ కూటమిలోకి వెళ్లారు. ఈ తిరుగుబాటు ఎంపిల పార్టీ మార్పుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తర్వాత ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ జూన్ నెలాఖరు నాటికి కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

ఏపిలో కొత్తవారికి అవకాశం

ఆంధ్రపదేశ్ నుంచి ఇప్పటికే ఒక కేబినేట్ మంత్రి, ఇద్దరు సహాయ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో టిడిపి నుంచి కేబినేట్ మంత్రిగా కె. రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, బిజెపి నుంచి సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మ ఉన్నారు. అయితే జనసేన నుంచి ఇప్పటి వరకూ ఇద్దరు ఎంపిలు ఉన్నారు. అయినా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఇప్పుడు లింగమనేని రమేష్ జనసేన నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో జనసేనకు అవకాశం లంభించనుంది. అలాగే టిడిపి నుంచి కూడా మరొకరికి అవకాశం లభించే నుంది. టిడిపి నుంచి ఎంపి ప్రసాదరావు, జనసేన నుంచి ఎంపి బాలశౌరి రేసులో ఉన్నారు. బిజెపి నుంచి అనకాపల్లి ఎంపి సిఎం రమేష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సిఎం రమేష్‌ కి ఛాన్స్ ఇవ్వాలంటే శ్రీనివాస వర్మ మీద వేటు తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరు కూడా బిజెపికి చెందిన వారే ఉన్నారు. జి. కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగానూ, బండి సంజయ్ సహాయ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో నిందితుడిగా ఉండటంతో కేబినెట్‌ ‌నుంచి సంజయ్‌‌ని తప్పించేవీలుంది. అదే జరిగితే బిజెపి మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ కు కేబినెట్‌‌లో చోటు దక్కేవీలుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్