mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆరు కోట్ల మంది ఓట్ల తొలగింపు

1 గంట క్రితం

bihar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 01:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎస్‌ఐఆర్‌కు ఏడాది పూర్తి

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఎంతటి తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసినా..వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు ఈ నెల 24తో ఏడాది కాలం పూర్తయింది. ఈ ప్రక్రియిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును కోల్పోయారు. వారి పేర్లను జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. ‌వీరిలో అత్యధికలు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, పేద వ్యవసాయ కార్మికులే ఉన్నారని ప్రతిపక్షాల విశ్లేషణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మూడో దశ ఎస్‌ఐఆర్‌ కొనసాగుతోంది.

బీహార్​లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం

గత ఏడాది జూన్ 24న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎస్‌ఐఆర్‌ ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. అప్పట్లో ఈ ప్రక్రియ ద్వారా ఏకంగా 65 లక్షల ఓట్లను తొలగించారు. అయితే, పత్రాలు లేవన్న నెపంతో, అధికార బిజెపికి మేలు చేసేందుకే ఎన్నికల సంఘం ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పునాదులనే దెబ్బతీస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా... ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ రాజ్యాంగబద్ధమైనదేనని ‌తీర్పు వెలువరించింది. ఈ తీర్పు దురదృష్టకరమని ప్రతిపక్షాలు వాపోయాయి. అయితే, ఈ ఓట్ల తొలగింపు ప్రభావం సంక్షేమ పథకాలపై కూడా పడుతోంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల డేటాను సామాజిక భద్రతతో అనుసంధానం చేయడంతో, ఓటు హక్కు కోల్పోయిన పేదలు ..ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరమయ్యారు.

2025 అక్టోబర్ 27న ప్రకటించిన రెండవ దశలో, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ - నికోబార్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో సర్ ప్రక్రియను నిర్వహించారు. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి సరాసరిగాఓటర్ల జాబితాను 10.2 శాతం మేర తగ్గించారు. పైన పేర్కొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికల పోలింగ్ కు ముందు ఓటర్ల సంఖ్య 50.99 కోట్లకు పైగా ఉంటే.. సర్ తర్వాత 45.81 కోట్లకు తగ్గింది. అంటే ఇది 5.18 కోట్లకు పైగా తగ్గిందన్న మాట. అంటే ఓటర్ల జాబితా 10.2 శాతం తగ్గింది. మరణించిన మొత్తం ఓటర్లు 66 లక్షల 88 వేల 636 మంది ఓటర్లను లిస్టు నుండి తొలగించారు. వీరిలో ఎక్కువ ఉత్తర ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలలోనే ఉన్నాయి. యూపీలో 25.47 లక్షలు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుండి 24.16 లక్షలు ఓట్లు తొలగించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అభ్యంతరాలు, విచారణ తర్వాత మొత్తం 63 లక్షల 16 వేల పేర్లను తొలగించారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఫైనల్ లిస్టులను వేర్వేరు తేదీలలో విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్ ఈ డేటాను చివరిగా విడుదల చేసింది. 3వ దశలో భాగంగా.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ జరగాల్సి ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక,మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,మిజోరం,నాగాలాండ్ ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఛండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ.. ఇలా మొత్తం 12 రాష్ట్రాలలో కొనసాగుతోంది.

ఎన్​సిఇఆర్‌‌టి పాఠ్యాంశంగా..

ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమం ప్రాముఖ్యతను గుర్తిస్తూ, దీనిని ఎన్‌‌సిఇఆర్‌‌టి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాల్లో కూడా చేర్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులను తొలగించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా అందులో వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్