మేఘాల్లారా రారండి
జోరుగా వర్షం కురిపించండి
చెరువులన్ని నిండాలి
పొలానికి నీరు పారాలి
పొలములో హలము తిరగాలి
పంటలు బాగా పండాలి
గాదెలు అన్నీ నిండాలి
అమ్మ కమ్మని వంట చేయాలి
మా బొజ్జ నిండాలి
చక్కగా బడికి వెళ్లాలి
చదువులు బాగా చదవాలి
అపార జ్ఞానం పొందాలి
ప్రజలకు జ్ఞానం పంచాలి
ఆటలు ఎన్నో ఆడాలి
కండలు బాగా పెంచాలి
వీర సైనికులమవ్వాలి
దేశ సేవచేయాలి
- జాధవ్ పుండలిక్ రావు పాటిల్,
94413 33315.








కామెంట్‌లు (0)