mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా దాడిలో మృతి చెందిన సీ మెన్‌ సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలి

1 గంట క్రితం

citu dharna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 01:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫార్వర్డ్ సీ మెన్ యూనియన్ ఆఫ్ ఇండియా (సిఐటియు) ఆధ్వర్యాన కొవ్వొత్తుల ప్రదర్శన

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : అమెరికా సైనిక దాడిలో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన సీ మెన్ పట్నాల సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఫార్వర్డ్ సీ మెన్ యూనియన్ ఆఫ్ ఇండియా (సిఐటియు) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గురజాడ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఫార్వర్డ్ సీ మెన్ ఆఫ్ ఇండియా నాయకులు విఎస్.పద్మనాభరాజు, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ, యుద్ధంతో ఎలాంటి సంబంధమూ లేని భారతీయ సీ మెన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వాస్తవాలను దేశ ప్రజలకు వెల్లడించాలని, అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన చర్యలు చేపట్టి మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. విదేశీ నౌకల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సీ మెన్ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన పట్నాల సురేష్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.పది కోట్ల నష్టపరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం, పిల్లల విద్యాభ్యాసానికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఫార్వర్డ్ సీ మెన్ యూనియన్ ఆఫ్ ఇండియా (సిఐటియు), వాటర్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి బి.జగన్, సిఐటియు నాయకులు సిహెచ్.త్రినాథరావు, సామమూర్తి, కృష్ణారావు, వెంకటరావు, వై.రాజు, జివిఎన్.చలపతి, యు.ఎస్.ఎన్.రాజు, అప్పారావు, కుమారి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, జిల్లా నాయకులు వై.సత్యవతి, బి.పద్మ, కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్నాల సురేష్ చిత్రపటానికి నివాళులర్పించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్