ప్రజాశక్తి - కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి) : సమస్యల పరిష్కారం కోరుతూ ... కపిలేశ్వరపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్ఏ ల సమ్మె సోమవారంతో 13 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విఆర్ఏ ల సంఘ అధ్యక్ష కార్యదర్శులు పలివెల నాగేశ్వరరావు, కొల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విఆర్ఏ లకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు అర్హత కలిగినవారందరికీ తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని, నామిని విఆర్ఏ లను వెంటనే గుర్తించి వారికి న్యాయం చేయాలని, తదితర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అదబాక శివప్రసాద్, ముమ్మిడివరపు జానకి బాబు, పలివెల ప్రసాద్, మండల విఆర్ఏలు పాల్గొన్నారు.
13 వ రోజుకు చేరుకున్న విఆర్ఏ ల సమ్మె
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)