ప్రజాశక్తి-పుట్లూరు: ఎల్లుట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య నిజాయితీ ఎల్లుట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య తమ గ్రామంలో నుండి తాడపత్రికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా నారాయణరెడ్డి పల్లె గ్రామం దాటిన తర్వాత ఎల్లనూరు మండలం కొడవండ్లపల్లి గ్రామానికి చెందిన ఆరవేటి ప్రేమ్ కుమార్ కు చెందిన పర్సు పడిపోవడంతో వెంటనే వెంకటయ్య పర్సులోని వివరాలు చూడగా ఫోన్ నెంబర్ లేకపోవడంతో పుట్లూరుకు వచ్చిన వెంటనే ప్రజాశక్తి విలేఖరి చంద్ర శేఖర్ రెడ్డికి ఫోను చేసి తనకు పర్సు దొరికినదని, దానితో 2500 అమౌంట్ తో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఎల్లనూరు మండలంలో ఉన్న పరిచయాలతో పర్సు పోగొట్టుకున్న ప్రేమ కుమార్ ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ ద్వారా ఫోన్ చేసి పుట్లూరుకి పిలిపించుకొని వెంకటాయ చేతుల మీదుగా ప్రేమకుమార్ కు పర్సును నగదును అందజేశారు జరిగింది. దీంతో వెంకటయ్య నిజాయితీని గ్రామస్తులు అభినందించారు.
ఎల్లుట్ల వెంకటయ్య నిజాయితీ
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)