గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు దశాబ్దాల చరిత్రకు పట్టం కట్టబోతున్నాం...

1 గంట క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 10:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- శిల్పారామం నిర్లక్ష్యాన్ని సహించబోము

- శిల్పారామంను అభివృద్ధి వైపుగా నడిపించేందుకు సమిష్టిగా కలిసి రావాలని పిలుపు

- డిసెంబర్ 18న సహపంక్తి భోజనాలు

- మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి

ప్రజాశక్తి-అనంతపురం : మూడు దశాబ్దాన్ని చరిత్ర కలిగిన అనంత శిల్పారామం లో అభివృద్ధి వైపుగా నడిపించేందుకు రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. స్థానిక శిల్పారామం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన నేషనల్ పార్క్ ప్రస్తుత శిల్పారామం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా డిసెంబర్ 18వ తారీఖున పదివేల మందికి సహబంతి భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 6 నుండి మూడు దశాబ్ద ఉత్సవాలను వివిధ కార్యక్రమాల రూపంలో ప్రారంభించింది ఉన్నట్లు చెప్పారు. శిల్పారామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో శిల్పారామం, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నతమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తమకు ఎలాంటి శత్రుత్వం లేదని వర్గాలను ప్రోత్సహించడం అవసరం లేదని నిరంతరం టిడిపి పార్టీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గెలుపు కోసం తాము కట్టుబడి పని చేస్తామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోను సమిష్టి కృషిగా పార్టీ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. శిల్పారామం నిర్లక్ష్యానికి గురి కాకూడదని మూడు దశాబ్దాల కింద చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని తిరిగి చేపడుతున్నామని తెలిపారు. అనంతపురం చరిత్రలో శిల్పారామం కు ప్రాధాన్యత తీసుకురావడం కోసం ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని వధంగా శిల్పారామంలో ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎంతోమంది మహనీయులు తిరిగిన ఉద్యానవనాన్ని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మూడు దశాబ్ద ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శిల్పారంలో నిర్లక్ష్యానికి గురైన మ్యూజియం వాటర్ ఫౌంటెన్ వంటి వాటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు జగదీష్, టిడిపి సీనియర్ నాయకులు షకీవుల్ల గంపన్న పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్