మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల అసిస్టెంట్‌ అధికారి పై దాడి

14 గంటల క్రితం

Attack on Assistant Election Officer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నామినేషన్‌ చింపేయాలని ఒత్తిడి.. నిరాకరించడంతో దాడి చేసి చొక్కా చించారని బాధితుడి ఆరోపణ


ప్రజాశక్తి–మదనపల్లె టౌన్ (అన్నమయ్య) : మదనపల్లె పట్టణంలోని దొంతి వీధిలో ఉన్న మున్సిపల్‌ ఎన్నికల కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అసిస్టెంట్‌ అధికారి బుర్రయ్యపై దాడి చేసి, చొక్కా చించివేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. బాధితుడు బుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం ... మదనపల్లె పదో వార్డుకు చెందిన శ్రీరామ సహదేవనాయుడు తన వద్దకు వచ్చి, అదే వార్డులో పోటీ చేస్తున్న ప్రత్యర్థి అభ్యర్థి యు.సుధాకర్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను చించివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధమైన ఆ చర్యకు తాను నిరాకరించడంతో, సహదేవనాయుడితో పాటు వచ్చిన రాజేష్‌ తనపై దాడి చేసి కొట్టడంతోపాటు చొక్కా చించివేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు ఎన్నికల అసిస్టెంట్‌ అధికారి ప్రమీలకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల సిబ్బందిపై దాడి జరిగిందనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్