బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశాంత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం

19 నిమిషాల క్రితం

annamaya.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జిల్లా ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ బాలకృష్ణ

ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్య) : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో పోలింగ్‌ సిబ్బంది పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ బాలకృష్ణ తెలిపారు. బుధవారం పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓ)లకు నిర్వహిస్తున్న పోలింగ్‌ విధుల శిక్షణ కేంద్రంతోపాటు ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో మనకు ఎంత అనుభవం ఉన్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అందించే శిక్షణను సద్వినియోగం చేసుకుని నిబంధనలు, మార్గదర్శకాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ, విధులపై సిబ్బందికి అందిస్తున్న అవగాహనను, శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు, ఓటర్ల గుర్తింపు, ఓటింగ్‌ ప్రక్రియ, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్‌ అనంతరం రికార్డులు, సామగ్రి అప్పగింత వంటి అంశాలపై సిబ్బంది స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివశంకర్‌, ఎంఈఓ-2 పద్మావతి, మాస్టర్‌ ట్రైనర్లు, ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్