హాజరైన డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రాధిక
ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎం అండ్ హెచ్ఓ) రాధిక,డాక్టర్ కిరణ్ కుమార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్, బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలోని,ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసిటిసి) మరియు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టి) ఆర్ఎన్ టిసి సెంటర్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా వారు రోగుల నమోదు రికార్డులు, చికిత్స వివరాలు, ఫాలో-అప్ విధానాలు,సౌచ్ పోర్టల్ నమోదు, మందుల నిల్వలు, కార్యక్రమం (ఎన్ఏసిపీ)కు సంబంధించిన ఇతర పత్రాలను పరిశీలించారు. అధికారులు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని రికార్డులను సక్రమంగా మరియు ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. హెచ్‌ఐవీ పరీక్షల సేవలు, కౌన్సెలింగ్, రోగుల చికిత్స రికార్డులు, మందుల పంపిణీ, మొత్తం సేవల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రికార్డులను నిరంతరం నవీకరించాలని, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో డాక్టర్ వెంకన్న బాబు టీబీ యూనిట్ సిబ్బంది అలాగే ఐసిటిసి కౌన్సిలర్ ఆనంద కుమార్, ఐసిటిసి-ఎల్.టి లక్ష్మీకాంత్ ఆర్ఎన్ టిసి - ఎల్.టి రియాజ్ మరియు హాస్పిటల్ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)