శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారులు ఆక్వా రైతులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి

14 జులై, 2026

YS Jagan Mohan Reddy stands by fishermen and aqua farmers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 08:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్న కూటమి నాయకులు

ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు నాయుడు


ప్రజాశక్తి-రేపల్లె (బాపట్ల) : రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారి తరఫున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైయస్సార్సీపి వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం లో మత్స్యకార కుటుంబాలను పలకరించేందుకు వెళుతున్నారని రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ అన్నారు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యల ను కూటమి ప్రభుత్వంని ప్రశ్నించేందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిడీవర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన చలో భీమవరం* కార్యక్రమానికి రేపల్లె నియోజకవర్గం నుండి ఆక్వా రైతులను మరియు రైతులను భారీగా తరలి రావాలనికోరారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీట నాగమోహన్ కృష్ణ రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ పరిశీలకులు ఆడప శేషు పాల్గొన్నారు. కడప చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగిస్తుందన్నారు ఏదైనా సమస్య ఉంటే ముందుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తే తప్ప కూటమి ప్రభుత్వానికి సమస్య తెలియడం లేదన్నారు ఆ సమస్యను జగన్మోహన్ రెడ్డి వెళ్లి మాట్లాడిన తర్వాతే కూటమి నాయకులు వెళ్లి పరిశీలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ వారు భూముల సర్వే తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో భూ సర్వే చేసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే దాన్ని తప్పు పట్టిన కూటమి ప్రభుత్వం అదే పట్టాదారు పాస్ పుస్తకాలను పైన అట్ట తొలగించి రాజముద్రవేశామని రైతులకు పంపిణీ చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో కూటమి నాయకులు ప్రజలను నట్టేట ముంచుతున్నారని అన్నారు వైఎస్ఆర్సిపి హయాంలో సూది మొన మోపినంత భూమి కూడా కబ్జాలకు గురి కాలేదు అన్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి భజన చేయనిదే కూటమి నాయకులకు ఆరోజు గడవదని కలలో కూడా జగన్ మోహన్ రెడ్డిని తలుస్తే గాని వారికి నిద్ర పడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సిపి హయాంలో ఏర్పాటు చేసిన ఇసుక దిబ్బలను ఎవరికి తెలియకుండా దొంగ దారిన దోచేశారని ఆయన అన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కూటమిపు నాయకులు ఉదయం లేచిన దగ్గర నుండి గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ అని అనడం తోనే పరిపాలన చేస్తున్నారని అసలు బూడిద పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులేనని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బూడిద పార్టీ అని చనిపోయిన వ్యక్తి మాయం చేసి కనీసం కన్న తల్లిదండ్రులకు బూడిద కూడా ఇవ్వలేదని ఆ బూడిదను కూడా సొమ్ము చేసుకునేలా తెలుగుదేశం పార్టీని నాయకులు వ్యవహరిస్తుంటే అది మరిచి వైయస్సార్సీపి పార్టీని గొడ్డలి పోయెత్తి వినడం వారికి సిగ్గుందా అని ఆయన ప్రశ్నించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్