మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

షైనింగ్ అవార్డులను అందుకున్న టాపర్ స్టూడెంట్స్

6 గంటల క్రితం

Topper students who received Shining Awards
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కలెక్టర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న తరుగు కార్తీక్ హర్షిత కీర్తన హేమ హిన్నిషా గాయత్రి


ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం (చిత్తూరు) : ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరుగు కార్తీక్ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు రావడంతో మంగళవారం చిత్తూరు జడ్పీ సమావేశం మందిరంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా తరుగు కార్తీక్ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నారు. ఎస్ఆర్ పురం మండలంలో హర్షిత కీర్తన హేమ హిన్నిషా గాయత్రి వీరు కూడా ఉత్తమ ఫలితాలు సాధించడంతో వీరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నారు . సైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న అందరిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. తరుగు కార్తీక్ తండ్రి తరుగు బాబును అవార్డు అందుకున్న తల్లిదండ్రులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం ఎంఈఓ సబర్మతి పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేశవులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్