సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టవా ? : వైఎస్.జగన్

5 రోజుల క్రితం

Is the government indifferent to farmers' suicides? : Y.S. Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 03:39 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • రోడ్డున పడుతున్న పొగాకు రైతన్నలు

  • చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర కానరాదు

  • వెన్నుపోటు పార్టీతో ప్రజలు నష్టాలపాలు

  • రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టవా..?

  • నష్టాల ఊబిలో పొగాకు రైతులు

  • ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్


ప్రజాశక్తి-దేవరపల్లి (తూర్పు గోదావరి) : చంద్రబాబు రెండేళ్ల పాలనలో రైతన్నలు ముఖ్యంగా పొగాకు రైతన్నలు రోడ్డున పడ్డారని వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తొలుత తాడేపల్లి నుండి హెలీకాఫ్టర్‌లో దేవరపల్లికి చేరుకున్న ఆయనకు వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుండి దేవరపల్లి పొగాకు బోర్డు కేంద్రం వరకు భారీ కాన్వాయ్‌తో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు రెండు గంటల పాటు ఈ ర్యాలీ సాగింది. అనంతరం పొగాకు బోర్డు కేంద్రంలో ఆయన పొగాకు రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గిట్టుబాటు ధర రావడం లేదని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో రైతులు.. ముఖ్యంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. వైసిపి పాలనలో కేజీ రూ.365 వరకు ధర పలికిందని, నేటి కూటమి పాలనలో రూ.260కు మించడం లేదని తెలిపారు. వైసిపి పాలనలో లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న రుణంపై వడ్డీని వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతు ఎన్నో కష్టనష్టాలను చవిచూస్తున్నా కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ రైతుల మొరను ఆలకించేందుకు రాలేదని తెలిపారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి ఆత్మహ్యలు చేసుకునే పరిస్థితిలోకి నెట్టబడుతున్నారని అన్నారు. కేజీ పొగాకుకు రూ.70లు నష్టపోతున్నారని, పొగాకును కొనేదానికంటే రిజక్ట్ చేసేదే అధిక శాతం ఉంటుందని, గత వైసిపి ప్రభుత్వంలో లో గ్రేడ్ పొగాకును సైతం కొనుగోలు చేశారని కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోవడంతో పొగాకు రైతు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయనకు వివరించారు. ఎకరానికి రూ.3లక్షలు పెట్టుబడి పెట్టామని, గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పలువురు రైతులు కన్నీరు పెట్టుకున్నారు. రైతుల సమస్యలను, ఇబ్బందులను, నష్టాన్ని తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు జరగరాని నష్టం జరుగుతూనే ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని సమస్యలపై ప్రశ్నిస్తూంటే అక్రమంగా అరెస్టులు చేసి జైళ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ వల్ల ప్రజలకు మేలు కంటే కీడే అధికంగా జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు రోడ్డున పడుతున్నా, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. బాధిత రైతులను కనీసం పరామర్శించే పరిస్థితి కూడా నేటి కూటమి ప్రభుత్వ పాలకులకు లేకుండా పోయిందన్నారు. రైతులు పండించిన పొగాకులో కనీసం 21శాతాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని మండిపడ్డారు. వైసిపి పాలనలో పొగాకు కేజీ రూ.289కి విక్రయాలు జరిగితే ప్రస్తుత కూటమి పాలనలో రూ.236 మాత్రమే ఇస్తున్నారన్నారు. తమ పాలనలో రూ. లక్ష వరకు పొగాకు రైతుకు సున్నా వడ్డీ రాయితీని కల్పిస్తే చంద్రబాబు ఆ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసారని అన్నారు. రైతు భరోసా సాయంలోనూ కోతలు విధించారని అన్నారు. చంద్రబాబు పాలన రైతులకు హానికరంగా మారిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం దళారులతో రాజీపడటంతో దళారులు సిండికేటుగా మారి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

jagan


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్