ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : కడియం మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 10 గ్రామ పంచాయతీల్లో 77.16 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య కౌంటింగ్ కేంద్రాలకు చేరాయి. ఎన్నికల సిబ్బంది లెక్కింపు కోసం సిద్ధం అవుతున్నారు. 10 గ్రామపంచాయతీలో 62081 వేల ఓట్లు ఉండగా, 47904 ఓట్లు పోలయ్యాయి. పురుషుల కంటే మహిళలు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి కొద్ది గంటల్లో వెల్లడి కాబోయే ఫలితాలపై గ్రామాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
పోలింగ్ ముగిసింది .. ఓట్ల కౌంటింగ్ కు ఏర్పాట్లు
30 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 03:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)