- టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
- పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయింపుపై టీడీపీ నేతల ధర్నా
ప్రజాశక్తి - పెద్దాపురం: పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ సీటుని జనసేన పార్టీకి కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చైర్మన్ సీటుని టీడీపీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానిక నాయకులు ధర్నా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబు రాజుకు చైర్మన్ సీటుని కేటాయించాలని ఆందోళనకారులు కోరారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ సీటుని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న కార్యకర్తలు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో కూటమి పార్టీల మధ్య పదవుల కేటాయింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.








కామెంట్లు (0)