mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైవే అధికారుల నిర్లక్ష్యం.. వర్షపు నీటిలో చిక్కుకున్న కారు

2 గంటల క్రితం

Negligence of highway officials... Car stuck in rainwater.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : హైవే అధికారుల నిర్లక్ష్యానికి కారు వర్షపు నీటిలో చిక్కుకుంది. ఆదివారం జగ్గంపేటలో కురిసిన వర్షానికి హైవే పక్క సర్వీస్ రోడ్డులో వాహనదారులు నిలిచిపోయి అవస్థలు పడ్డారు. పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న ఆంజనేయ ఆలయం వద్ద హైవే అధికారులు డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో కొద్దిపాటి నీరు నిలిచిపోతుంది. సర్వీస్ రోడ్డులో ఉన్న డ్రైనేజీ హైవేకు సంబంధించినది కావడంతో పంచాయితీ అధికారులు దాని జోలికి పోవడంలేదు. దీంతో వర్షం వస్తే నీరు నిలిచిపోతుంది. నీరు నిలిచినప్పుడు మెయింటెనెన్స్ సిబ్బంది ఆ నీరు పోయేలా చేస్తున్నారు కానీ ఎప్పటి నీరు అప్పుడు హైవే డ్రైనేజీలోకి వెళ్ళేలా ఏర్పాట్లు చేయడంలేదు. అలా చేస్తే ప్రయాణికులు అవస్థలు తగ్గుతాయి. శాశ్వత పరిష్కార ప్రయత్నం హైవే అధికారులు చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హైవే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్