ప్రజాశక్తి-వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలంలోని గ్రామాల్లోని అన్నదాతలు వరుణడి కనికరం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎండ తీవ్రతకు నారుమడులు ఎండిపోయాయి. సాయంత్రాలు నల్లటి మబ్బులు కమ్ముకున్నప్పటికీ చుక్క వాన నీరు పడకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంతో పాటు నడుకూరు , విక్రంపురం, చిదిమి , వండువా రేగులపాడు, తూడి, బూరుగా, చలివేంద్రి, దశమంతపురం , నడిమికల్లా, కంబర ,మహాదేవి వలస, తదితర గ్రామాల్లోని రైతులు నారుమడులు సిద్ధం చేసుకుని విత్తనాలు చల్లగా అక్కడక్కడ మొలకెత్తినప్పటికీ వాటికి నీరు లేక ఎండిపోతున్నాయి. పివిఆర్ పురం, డిపి వలస, బిటివాడ, యు.వెంకంపేట, తదితర గ్రామాల్లో వర్షాల పైన ఆధారపడి రైతన్నలు విత్తనాలు చల్లుకున్నప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో అవి కూడా ఎండ తీవ్రతకు వాడుతున్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి విత్తనాలు కొనుగోలుతోపాటు దుక్కులు వేసి పంట భూములను చదును చేసి విత్తనాలు చల్లినప్పటికీ వాన లేక ఫలితం లేకుండాపోతుందని అన్నదాతలు తెలిపారు. ప్రతి ఏడాది వరి పంట సాగుపై పెట్టుబడులు అధికమైనప్పటికీ వాటిని కాస్త తగ్గించుకునేందుకు ఈ ఏడాది ఎక్కువగా విత్తనాలు చల్లుకున్నారు.
కరుణించని వరుణుడు .. తడవని నారుమడులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)