mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి : పోలియో చుక్కల కార్యక్రమంలో సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

The joint family system must make a comeback: CM Chandrababu at the polio vaccination drive.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 05:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలన్నారు. పరిస్థితులు మారాయని, సంతానం భారంగా కాకుండా.. సంపదగా మారిందని పేర్కొన్నారు. ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగానికి, ఉపాధికి వెళుతున్న మహిళలు.. పిల్లల పెంపకాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగారు. ఇంట్లో భర్త, మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించారు. పిల్లల్ని కని, పెంచడం, వారి ఆలనాపాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో భాగస్వాములు అయ్యేవారని అన్నారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబసభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని గుర్తుచేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని, అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని కోరారు. ఇద్దరు.. అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని సిఎం చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్