- పినరయి విజయన్ డిమాండ్
‘అయోధ్య’ కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు
- పినరయి విజయన్ డిమాండ్
తిరువనంతపురం : అయోధ్య రామమందిరం నిధుల అక్రమాలు తీవ్రమైన విషయమని కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా జవాబు చెప్పాలని, సర్వోన్నత న్యాయస్థాన పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మందిరం నిర్మాణానికి సేకరించిన విరాళాలలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వచ్చిన నివేదికలు అత్యంత తీవ్రమైనవన్నారు. ఇంతకాలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల విశ్వాసాన్ని వాడుకున్నారు. ఇప్పుడు వారు ఆర్థిక మోసం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహనికి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరై, ప్రచారం చేసుకున్న మోడీ దేశానికి వివరణ ఇవ్వాలని విజయన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని, భక్తుల నుండి వసూలు చేసిన ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాల్సిందే అని విజయన్ స్పష్టం చేశారు. అయితే ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..








కామెంట్‌లు (0)