ప్రజాశక్తి-కోటనందూరు
తుని మండలంలోని 23 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు సంబంధించి శనివారం తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు సర్పంచ్ పదవులకు 35 మంది, వార్డు సభ్యుల పదవులకు 196 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపిడిఒ సిహెచ్ రవికుమార్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అభ్యర్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎంపిడిఒ సూచించారు.
నామినేషన్ వేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు








కామెంట్‌లు (0)