గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చేబ్రోలులో అన్నదానం, దుప్పట్ల పంపిణీ

4 రోజుల క్రితం

చేబ్రోలులో అన్నదానం, దుప్పట్ల పంపిణీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పిఠాపురం

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఎంపిపి ఓదూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం అన్నదానం, దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి, డిసిఎం పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో 2011వ సంవత్సరం నుండి నిరంతరాయంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తమ కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదానం, చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓదూరి కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్