బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామాల్లో త్రాగునీటి రక్షణకు నిత్యపర్యవేక్షణ

1 గంట క్రితం

aalamuru-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎంపీడీవో రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భాగ్యరాజ్

ప్రజాశక్తి - ఆలమూరు : గ్రామాల్లో త్రాగునీటి రక్షణకు స్థానిక అధికారులు నిత్య పర్యవేక్షణ తప్పకుండా చేయాలని ఎంపీడీవో ఏ.రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఇంచార్జ్ ఏఈ భాగ్యరాజ్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో త్రాగునీటి రక్షణకు ప్రత్యేక చర్యలపై పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. గ్రామాల్లో త్రాగునీటి సరఫరా చేసే ట్యాంకుల నిర్మాణాలలో జాప్యం వద్దన్నారు. అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మండలంలో మొట్టమొదటిసారిగా చొప్పెల్ల గ్రామ పంచాయతీ ద్వారా గ్రామస్తులకు సరఫరా చేసే త్రాగునీటి రక్షణ కోసం వాటర్ ట్యాంక్ కు వెళ్లే బోర్ డెలివరీ లైన్ లో డైలీ క్లోరినేషన్ జరిగేలా చర్యలు చేపట్టమన్నారు. ఇందుకు రెండు మోటారుల అవుట్ పుట్ లైన్లో క్లోరినేషన్ సిస్టంలను అమర్చడం జరిగిందన్నారు. దీంతో నీరు మోటారు నుంచి టాంక్ లోకి వెళ్ళే మధ్యలో క్లోరినేషన్ కి కావలసిన టాబ్లేట్లు వేస్తే అవి కరిగి నేరుగా వాటర్ ట్యాంక్ లోకి క్లోరినేషన్ చేసిన నీరు వెళుతుందన్నారు. దీంతో వాటర్ ట్యాంక్ నుండి వెలువడే నీరు కుళాయిలకు సరఫరా అయ్యే లోపల బ్యాక్టీరియా ఉంటే అవి నశించిపోతాయని, తద్వారా పరిపూర్ణమైన త్రాగునీరు గ్రామం లోకి వెళుతుందన్నారు. అలాగే గ్రామాల్లో త్రాగునీటి కుళాయిలు, సరఫరా చేసే గొట్టాలకు ఏమైనా మరమ్మత్తులు ఉంటే ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు విస్తృతంగా అధికారులు వీధుల వారీగా పర్యటిస్తూ సమస్యలను గుర్తించి మరమ్మత్తులు చేయించాలన్నారు. ఇకపై ఇలాంటి వాటిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు రేణుక, వెంకటరత్నం, సాయి ప్రసాద్, వేణి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్