mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కిషోర్ బాలల సాధికారత – మనందరి బాధ్యత

09 జూన్, 2026

empowerment-of-kishore-children-is-our-responsibility
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 03:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ఆలమూరు:  కిషోర్ బాలల సాధికారత మన అందరి బాధ్యతగా పేర్కొంటూ కొత్తపేట ఐసిడిఎస్ ప్రొజెక్టు ఆఫీసర్ సిడిపిఓ ఏ.గజలక్షి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీలు సంయుక్తంగా మంగళవారం చెముడులంక పంచాయతీ వద్ద బాల, బాలికలతో కిషోర్ వికాసంలో భాగంగా గ్రామసభలో వేసవి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బాలలతో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ చేపట్టారు. ఇందులో బాల్య వివాహాలను నిరోధించాలి,  బాలికల భధ్రత, విద్య ప్రోత్సాహం, గ్రామస్థాయి నిర్ణయాలపై చర్చించారు. అలాగే బాల బాలికల భద్రత కోసం సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు వంటి వాటిపై జరుగుతున్న అకృత్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏం.ఎల్.హెచ్.వి లు, మాధురి, అచ్ఛా మణి, ఏఎన్ఎం లు శాంతి, జోస్నా, జి.ఎం.ఎస్.కెలు సాధన, సంధ్య, అంగన్వాడీలు యు.సుశీల, కె.సూర్య కుమారి, వి.రామలక్ష్మి, జి.సత్యవతి, కె.జ్యోతి సిబ్బంది, కిషోర్ బాలలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్