ప్రజాశక్తి-మొవ్వ (కృష్ణా) : సిపిఎం పార్టీ కార్యకర్త, మొవ్వ శాఖ పార్టీ సీనియర్ సభ్యులు మొవ్వ గ్రామపంచాయతీ వార్డు మాజీ సభ్యులు కామ్రేడ్ తప్పట లాజరు (68) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకొని మొవ్వ మండల సిపిఎం పార్టీ కమిటీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సోమవారం ఉదయం మొవ్వ గ్రామంలో లాజరు భౌతిక కాయానికి పార్టీ పతాకాన్ని కప్పి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. లాజరు నిస్వార్ధంగా ఉంటూ తను చనిపోయే వరకు ఎర్రజెండాను వదలని గొప్ప కార్యకర్త, అందరితో కలిసి మెలిసి ఉంటూ పార్టీ ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులో నిత్యం పాల్గొంటూ స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం కోసం కృషి చేసేవారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శీలం నారాయణరావు, పార్టీ సీనియర్ నాయకులు మద్దుల బసవయ్య, చేబ్రోలు బసవపూర్ణ, కొడాలి కరుణాకరరావు, కొడాలి శ్రీనివాసరావు, పార్టీ సభ్యులు చిగురుపల్లి సుబ్రహ్మణ్యం, మరియు ఆర్టిఐ జాతీయ ఉపాధ్యక్షులు నడ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం సీనియర్ సభ్యులు లాజరు మృతి
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)