గుడివాడ రూరల్
గుడివాడ ఎస్ డిపిఒ పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత సమస్యాత్మక గ్రామమైన మోటూరులో పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సందర్భంగా గ్రామంలో డ్రోన్ కెమెరా సహాయంతో నిఘా నిర్వహిస్తూ, గ్రామ ప్రజలకు ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన నియమాలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, గుడివాడ రూరల్ ఎస్ఐఐ-1 ఎన్. చంటిబాబు, ఎస్ఐఐ-2 పి. ప్రకాష్, గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)