బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డుపై ఆగిన వాహనాన్ని ఢీకొన్న బైక్ - యువకుడు మృతి

1 గంట క్రితం

Bike crashes into a stationary vehicle on the road young man dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గజపతినగరం (విజయనగరం) : మండలంలోని మరుపల్లి జంక్షన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మీసాలపేట గ్రామానికి చెందిన గంట్యాడ రోహిత్ కుమార్ బుధవారం అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం పై డ్యూటీ నిమిత్తం విశాఖపట్నం బయలుదేరారు. మరుపల్లి జంక్షన్ దగ్గరున్న రైస్ మిల్లు సమీపానికి వచ్చేసరికి, ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, రిఫ్లెక్టర్లు కూడా ఏ మాత్రం ఉంచకుండా రోడ్డుపైనే నిలిపి ఉంచిన ఒక టాటా వింట్రా వ్యానును రోహిత్ కుమార్ గమనించలేక వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో రోహిత్ కుమార్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆయనను గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ తెల్లవారుజామున సుమారు 3:40 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్