- సర్పంచి అభ్యర్థి నరవ శశిరేఖకు మద్దతుగా టీడీపీ విస్తృత ప్రచారం
- గెలిచిన వెంటనే మౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు: నరవ రమాకాంత్ రెడ్డి
ప్రజాశక్తి - పెద్దకడబూరు: పెద్దకడబూరు గ్రామా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ సర్పంచి అభ్యర్థి నరవ శశిరేఖ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని ఉంగరం గుర్తుపై ఓటు వేసి నరవ శశిరేఖ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దకడబూరు మండలం ను జిల్లాలోనే అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామంలో నెలకొన్న పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.ఐదేళ్ల పాటు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీసేవ ఆంజనేయులు, కోడిగుడ్ల ఏసేపు, బొగ్గుల తిక్కన్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)