ప్రజాశక్తి-యర్రావారిపాలెం (తిరుపతి) : మండలంలో అటవీ సమీప ప్రాంతాల్లో గత నెల రోజుల నుండి ఏనుగుల గుంపు సంచరిస్తూ సెమీబా ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోటగాడపల్లి పంచాయతీలో గల సిద్ధల గండి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి 22 ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. దీనితో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు తన సంతుని పెంచుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆహారం కోసం స్థానిక పంట పొలాలు తిరుగుతూ టమోటా, కొబ్బరి చెట్లు, మామిడి, పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కోటకాడపల్లి, చింతగుంట, నరబైలు, సిద్దలుగండి, మడిచెరువు, నల్ల సముద్రం ప్రాంతాలలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. కుంకి ఏనుగుల ద్వారా బంధించి రక్షణ కల్పించి తగు చర్యలు తీసుకోవల్సిందింగా అటవీశాఖ అధికారులును మండల ప్రజలు కోరుతున్నారు.
తలకోన అడవిలో 22 ఏనుగుల గుంపు హల్చల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)