సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశాలకు వెళ్లేందుకు అభిషేక్‌ బెనర్జీని అనుమతించిన సుప్రీంకోర్టు

1 గంట క్రితం

Abhishek Banerjee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : టిఎంసి ఎంపి అభిషేక్‌ బెనర్జీని కంటిచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. విదేశాలకు వెళ్లేందుకు, వారు కోరుకున్న చికిత్స పొందేందుకు ప్రతి వ్యక్తికి హక్కు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. విదేశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, ప్రయాణ ఆంక్ష‍లు విధించిన కోల్‌కతా హైకోర్టు ఆదేశాలను తిరస్కరిస్తూ అభిషేక్‌ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2026 పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయన అరెస్టుపై స్టే విధిస్తూ.. ప్రయాణ ఆంక్ష‍లు విధించిన సంగతి తెలిసిందే.


ఆయనపై 16 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ప్రయాణ ఆంక్ష‍లు కూడా ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు కోర్టుకు తెలిపారు. దేశంలో కావలసినన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే అది ఆయన ఇష్టమని, ప్రతివ్యక్తికి విదేశాలకు వెళ్లే హక్కుఉందని, ప్రతి వ్యక్తి తాను పొందవలసిన వైద్య సహాయాన్ని ఎంచుకునే హక్కును కలిగి ఉంటారని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి వ్యాఖ్యానించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్