న్యూఢిల్లీ : భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా జూన్‌లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 48శాతానికి చేరినట్లు తాజా నివేదిక తెలిపింది. భారతదేశంపై 100శాతం టారిఫ్‌లు విధించేందుకు అమెరికా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్న సమయంలోనూ రష్యా చమురు దిగుమతులు పెరగడం గమనార్హం. భారత్ చమురుకొనుగోళ్లను భారీగా తగ్గించుకున్నప్పటికీ.. రష్యా నుండి కొనుగోళ్లు ఈ ధోరణికి బిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో రష్యా నుండి భారత్ 8.7 ఎంఎంటి (మిలియన్ మెట్రిక్ టన్నులు) దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతులు మే నెలతో పోలీస్తే కేవలం ఒక్క శాతం తక్కువ కాగా, గతేడాది జూన్ నాటి కన్నా 25శాతం అధికం. ఈ వ్యూహం ఫలితంగా, భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా పరిమాణం పరంగా 48శాతానికి, విలువ పరంగా 48.6శాతానికి పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన మార్చి నెల నుండి ప్రతి నెల రష్యా దిగుమతుల వాటా పెరుగుతూనే ఉంది.
రష్యా, ఇరాన్ దేశాలపై ఆంక్షల చట్టం 2026ని గతవారం అమెరికా సెనెట్ ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై 100శాతం దాకా టారిఫ్‌లను విధించే అవకాశం ఉంది.









కామెంట్‌లు (0)