ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇది విశ్వవిద్యాలయమా ? లేక తెలుగుదేశం కార్యాలయమా ? : ఎఐఎస్ఎఫ్

21 నిమిషాల క్రితం

Is this a university or an office of the Telugu Desam Party AISF
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 01:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరుపతి : అఖిల భారత విద్యార్థి సమైక్య (ఎఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు చిన్న పాల్గొని మాట్లాడుతూ ... శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని రోజురోజుకు అధికారులు దయనీయంగా మారుస్తున్నారని వాపోయారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఫ్లెక్సీలు, రాజకీయ పార్టీలకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించకూడదని గతంలో రిజిస్టర్ భూపతి నాయుడు విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకుల సమావేశాలకు అనుమతి లేదు అని చెప్పి ఒక చీకటి సర్కులర్ తీసుకొచ్చి విద్యార్థి సంఘాల సమావేశాలకు అనుమతినివ్వకుండా చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన రిజిస్టర్ అని మరిచి కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రిజిస్టర్ భూపతి నాయుడు ప్రొఫెసర్ వృత్తిని వదిలేసి తెలుగుదేశం పార్టీ కండువకప్పుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు చరణ్, వేణు, దినేష్, ప్రేమ్, రవి, యువ, సిద్దు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్