ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా.. పంచాయతీ నిధుల్లో ప్రతి పైసా గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తా: టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బీపీ ఈరన్న
పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండలంలోని, హనుమాపురం గ్రామ సర్పంచి గా తనకు ఒక్క అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టిడిపి సర్పంచి అభ్యర్థి బీపీ.ఈరన్న అన్నారు. ఆదివారం గ్రామంలో ఓటర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిగా సేవలందిస్తానని తెలిపారు. మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఈరన్న పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తూ అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా.. సర్పంచి పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని బీపీ. ఈరన్న, తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆదరిస్తే హనుమాపురం గ్రామ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా ఓటర్లను అయన కోరారు.






కామెంట్‌లు (0)