mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చికిత్స పొందుతూ 9వ తరగతి విద్యార్థిని మృతి

3 గంటల క్రితం

9th-grade student dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి వేపాడ : వేపాడ మండలం బక్కు నాయుడుపేట వద్దగల కేజీబీవీ వసతి గృహములో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వారధి బిందు అస్వస్థతకు గురై వేపాడ పీహెచ్సీలో మృతి చెందినట్లు కేజీబీవీ వసతి గృహం ప్రిన్సిపల్ కిరణ్ మయి తెలిపారు.

వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం యోగా చేసేందుకు విద్యార్లులు గ్రౌండ్ లోకి వచ్చారు. వారధి బిందు యోగాకు రాకుండా నీరసంగా కూర్చుని ఉండడం గమనించిన వసతి గృహంలోని విద్యార్థులు శిక్షణ ఇస్తున్న టీచర్ బి అరుణకు తెలిపారు. నీరు తాగించి రూమ్ లోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అయితే నీరు తాగిన వెంటనే బిందు నోటి నుండి నురగ రావడంతో ఫిట్స్ వచ్చాయేమోనని భావించి చేతిలో తాళాలు పెట్టారు. చలనం లేకపోవడంతో వేపాడ పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీ లో ఉన్న ఏఎన్ఎం మీనాక్షి పరీక్షలు నిర్వహించగా పల్స్ అందడం లేదని, వెంటనే ఎస్ కోట హాస్పిటల్ కి తరలించాల్సిందిగా ఆదేశించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, వారు వచ్చిన తర్వాత ఆస్పత్రికి తీసుకువెళతామని అన్నారు. అయితే తల్లిదండ్రులు వచ్చేసరికి బిందు మరణించినట్లు వైద్యాధికారి ప్రేరణ తెలిపారు. వారు ఎస్ కోటకు తరలించేందుకు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న డి సి ఓ మాలతి, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు బిందు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రాత్రి బాగానే ఉందని, ఉదయం నీరసంగా ఉన్నట్లు గుర్తించి, ఆస్పత్రికి తరలించారని వసతి గృహం లోని తోటి విద్యార్థులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్