న్యూఢిల్లీ : అయోధ్య రామ మందిర విరాళాల వివాదంపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కేంద్రాన్ని నిలదీశారు. భారీ ఎత్తున విరాళాలు చోరీకి గురయ్యాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని, విరాళాల గల్లంతులో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని ఆదివారం ఎక్స్ లో పేర్కొన్నారు. `` కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని కలిగి ఉన్న అయోధ్య రామమందిరంలో కోట్లాది రూపాయలు చోరీకి గురయ్యాయి. అయినా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ప్రభుత్వం ఎవరిని కాపాడుతోంది. ఈ చోరీలో ప్రమేయం ఉన్నవారు ఎంత పెద్దవారైనా సరే, వారిని నేరుగా జైలులో వేయండి. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని కాపాడటం చాలా అవసరం'' అని పోస్టులో పేర్కొన్నారు. యుపి పోలీసులు గానీ, ఈడి గానీ, సిబిఐ గానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. కేంద్రంలోనూ,యుపిలోనూ బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయని, అందుకే దాడులు లేవని, అరెస్టులు లేవని అన్నారు. ఇందులో పెద్దవాళ్ల పేర్లు ఉన్నాయని, చర్య తీసుకుంటే, ప్రభుత్వం కూడా కూలిపోవచ్చని అన్నారు.
అయోధ్య రామమందిర విరాళాల వివాదంపై ఎందుకు చర్యలు చేపట్టలేదు : కేజ్రీవాల్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 05:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)