అమరావతి: రాష్ట్రంలో రేపు మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు పలు జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (మన్యం), ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రేపు రాష్ట్రంలో భారీ వర్ష సూచన
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)