సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్ల కోసం డప్పు కళాకారులు, చర్మకారుల ధర్నా

2 గంటల క్రితం

dappu kalakarulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : ధరఖాస్తు చేసుకున్న డప్పు కళాకారులకు, ఛర్మకారులకు ఫింఛన్లు మంజూరు చేయాలని, డప్పులు,గజ్జెలు,కిట్లను ప్రభుత్వం అందించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎ.పి డప్పు కళాకారుల,చర్మకారుల సంఘం విజయనగరం అధ్యక్షులు రాకోటి రాములు, జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని గుర్తుచేశారు. పోరాట ఫలితంగా ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త ఫించన్లకు ధరఖాస్తులు చేసుకోమని నోటిపికేషన్ విడుదల చేసిందని అన్నారు. మొదటిలో గుర్తింపుకార్డులతో ముడిపెట్టి ధరఖాస్తుచేసుకోవడానికి వీలులేకుండా చేసిందని తెలిపారు. తరువాత సంఘం పోరాట ఫలితంగా గుర్తింపు కార్డులు లేకుండానే స్వీయ వాగ్మూలం ఆధారంగా ధరఖాస్తులను స్వీకరించిందని దీనిట్లో కూడా కుల,ఆధాయ దృవీకరణ పత్రాలు,ఆధార్‌ కార్డులతో ఫోన్ నెంబర్ లింక్ చేయడం వంటి షరతులు పెట్టడం వల్ల కొంత మంది ధరఖాస్తులు చేయకుండా మిగిలిపోయారన్నారు. జిల్లా మొత్తంగా అధికారిక లెక్కలు ప్రకారం సుమారు 4వేల మంది ఫించన్ల కొరకు ధరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. రాజకీయాలకు తావులేకుండా ధరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫించన్లు మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పాలకులు రాష్ట్రంలో అటకెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కళాకారులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి.దుర్గారావు,సహాయకార్యదర్శి నారాయణ అప్పడు,నాయకులు రామకృష్ణ,నర్సింగ్ రావు,పైడితల్లి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్