సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్సెలార్ మిట్టల్ పోర్టుతో మత్య్సకారుల జీవనోపాధికి దెబ్బ

1 గంట క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 05:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం

ప్రజాశక్తి-నక్కపల్లి : ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ పోర్టు ఏర్పాటు చేసి మత్య్సకారుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధం పేర్కొన్నారు. నక్కపల్లి మండలం డి ఎల్ పురం గ్రామంలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అక్టోబర్ 15వ తేదీన ఏర్పాటు చేసే గ్రీన్ ఫీల్డ్ క్యాప్టీవ్ పోర్ట్ ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి జీ.కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజేష్ లతోను మరియు స్థానిక మత్య్సకారులతో కలిసి డి‌ ఎల్ పురంలో పోర్టు ఏర్పాటు చేసే ప్రాంతంలో పర్యటించి మత్య్సకారులతో మాట్లాడి వారు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలను రాజ్యాంగాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామ సభలు పెట్టకుండా వాస్తవాలు మత్య్సకారులకు, సాగుదార్లు, కూలీలకు తెలియజేయకుండా పోర్టు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూడు కిలోమీటర్లు సముద్ర తీరాన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంకు పోర్టు ఏర్పాటు చేసు కోవడానికి విధంగా ఇస్తారని,మన జాతి సంపద, ప్రకృతి సంపద ఏ విధంగా కార్పోరేట్ కంపెనీకి ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు.

నక్కపల్లి మండలంలో బంగారమ్మపేట, డి ఎల్ పురం, అమలాపురం,బోయపాడు, రాజయ్య పేట గ్రామాలలో 35 వేల మంది మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి అవకాశం లేక ఉపాధి కోల్పోతారని, వీరంతా కుటుంబాలతో ఎలా జీవించాలని, వీరు జీవితానికి భరోసా ఎవరు ఇస్తారని మత్య్సకారుల జీవించాల్సిన అవసరం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.

పోర్టు యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రవేశ పెట్టిన సామాజిక ప్రభావ అంచనా నివేదిక అంతా తప్పులు తడకగా ఉందని చెప్పారు. ఆ నివేదికలో మత్య్సకారులు, రైతులు, కూలీలు ఉపాధి, ఉద్యోగాలు గురించి ఎక్కడా ప్రస్తావించలేదని కానీ ప్రభుత్వం ఇక్కడ స్టీల్ ప్లాంట్, పోర్టు ఏర్పాటు చేస్తే స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి వస్తాయని ప్రచారం చేస్తున్నారు, సామాజిక ప్రభావ అంచనా నివేదికలో పోర్టు యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి వారు పొంది పర్చకపోతే భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు, ప్రభుత్వం మత్య్సకారుల మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించిందని తెలిపారు. డి ఎల్ పురం, నిల్లిపూడి, గునుపూడి, అమలాపురం, చందనాడ, బోయపాడు, రాజయ్య పేట గ్రామాలను ఆనుకొని పోర్టు నిర్మాణం చేపడితే ఆ గ్రామాలలో ప్రజలు ఎలా నిర్వహిస్తారని తెలిపారు, ఇప్పటికే రాష్ట్రంలో పోర్టు లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాయు కాలుష్యము వెదజల్లి పర్యావరణ పాడై కాలుష్యం కారణంగా ప్రజలు అనేక రకాల రోగాలు బారిన పడి తీవ్రంగా అనారోగ్యాలు బారిన పడుతున్నారని ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి కంటే, ఉపాధి కంటే అనార్దాలే ఎక్కువుగా ఉంటాయని తెలిపారు. మత్య్సకారుల జీవనోపాధిని, ప్రజలు ప్రాణాలు ద్రృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 15వ తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్య్సకారులు డి.తాతారావు, సిహెచ్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్