సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణం సుగమం చేయండి

1 గంట క్రితం

alamuru -2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులు ఆలమూరు జాలర్ల పేట నుంచి సూర్యారావుపేట ఆర్ అండ్ బి రోడ్డుకు వెళ్లే మార్గం నిర్మాణానికి ఆక్రమణలు తొలగించి వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ఏ.రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ మార్గంలో నాలుగు కుటుంబాల వారు ఆక్రమించుకొని నివసిస్తున్నారన్నారు. వారిలో ముగ్గురికి ఇప్పటికే స్థలాలు మంజూరు చేశారని, మరొకరికి స్థల సేకరణ జరుగుతుందన్నారు. అయితే బీటీ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై ఎంపీడీవో రాజు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు రామానుజుల శేషగిరిరావు, ఈదల రాంబాబు, కేతా రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్