ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : స్థానిక గురజాడ పాఠశాలలో శ్రీ సత్య చారిటబుల్ ట్రస్ట్ మరియు గురజాడ స్కూల్ వారు సంయుక్తంగా ఫాదర్స్ డే సెలబ్రేషన్ ను ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజి తండ్రుల గొప్పతనాన్ని వారి బాధ్యత వారి చిత్తశుద్ధి గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు ఫాదర్స్ డాక్టర్ కే వెంకట్రావు , జయ ప్రశాంత్ కుమార్, వెంకట రమణను సన్మానించారు. ఇదే కార్యక్రమంలో శ్రీ సత్య చారిటబుల్ ట్రస్ట్ , సత్య స్కానింగ్ డయాగ్నొస్టిక్ సెంటర్ ఎండి డాక్టర్ కాదా వెంకటరమణ ప్రభుత్వ పాఠశాలలో చదివి 540 మార్కులు దాటి సాధించిన విద్యార్థులందరికీ గతవారం ఒక పోటీ పరీక్ష నిర్వహించారు. అందులో ప్రతిభ చూపిన వందకు పైగా విద్యార్థులకు మొత్తం తొమ్మిది లక్షల అరవై వేలు నగదు బహుమతిని ఈ కార్యక్రమంలో అందించారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించిన డాక్టర్ వెంకటరమణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కొనియాడరు. ఈ సందర్భంగా డాక్టర్ కే వెంకటరమణ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఈ విద్యార్థులు అందరూ కూడా చిత్తశుద్ధితో ముందుకు వెళుతూ కష్టపడి మరెన్నో విజయాలు సాధించాలని, చదువుతోపాటు సత్ప్రవర్తన విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
గురజాడ స్కూల్ లో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)