చెన్నై : తమిళనాడులో సీఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తిరువళ్లూరు జిల్లాలోని పెరియపాళయం సమీపంలో ఉన్న 'సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్'లో అమ్మోనియా లీకైన సంగతి తెలిసిందే. సుమారు 67మంది కార్మికులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఏడుగురు మహిళలు మరణించినట్లు అధికారులు తెలిపారు.
చెన్నై : సీఫుడ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో సుమారు 60 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. పెరియపాలయం సమీపంలోని మంజనగరణై వద్ద ఉన్న ఒక ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అమ్మోనియా గ్యాస్ లీకైంది. సుమారు 67మందిని ఆస్పత్రికి తరలించారు. 46మందికి వేల్స్ ఆస్పత్రికి, 21 మందికి వెంకటేశ్వర ఆస్పత్రిలో చికిత్స నందిస్తున్నారు. తొమ్మిది మందిని చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్ప్రతికి తరలించినట్లు తిరవళ్లూరు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరంతా వలసకూలీలని, ఉత్తరాంధ్ర నుండి వచ్చారని అన్నారు. తమ ఆస్పత్రికి తరలించిన 44మందిలో 43 మంది మహిళలు, ఒక వ్యక్తి ఉన్నట్లు వేల్స్ ఆస్పత్రి సీనియర్ వైద్యులు తెలిపారు. మహిళలంతా 24, 25 ఏళ్ల లోపు వారేనని అన్నారు.
త్రిసభ్య కమిటీని నియమించిన సిఎం విజయ్
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై త్రిసభ్య కమిటీని నియమించారు. పరిశ్రమల భద్రత, ఆరోగ్య శాఖ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. 24 గంటల్లోగా మధ్యంతర నివేదికను, మూడు రోజల్లో తుది నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.









కామెంట్‌లు (0)