ప్రజాశక్తి...విజయనగరం టౌన్ : విజయనగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న కార్పొరేట్ నారాయణ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారంతో ఎస్ ఎఫ్ ఐ విజయనగరం పట్టణ కమిటీ నాయకులు అక్కడికి వెళ్లి పుస్తకాల అమ్మకాలను అడ్డుకొని నిరసన తెలియజేయడం జరిగింది. శనివారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జీ సూరిబాబు, ఈ వంశీ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ స్కూల్ లో విచ్చలవిడిగా అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పిన నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఫీజులు కట్టడి చెయ్యాలని అధికారులకు వినతి పత్రాలు ఇస్తుంటే మరోవైపు బుక్స్, యూనిఫాం పేరుతో విచ్చలవిడిగా నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కుంటి సాకులు చెప్పి పుస్తకాలు అమ్మకాన్ని గాలికి వదిలేస్తున్నారు. విద్యని వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్న విద్యాసంస్థలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్ష్యకార్యదర్శులు సూరిబాబు, వంశీ, జిల్లా గుర్ల్స్ కో కన్వినర్ భారతి లతో పాటు పట్టణ కమిటీ సభ్యులు మురళి, సతీష్, కృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థల్లో పుస్తకాల అమ్మకాలపై ఎస్ ఎఫ్ ఐ నిరసన
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)