సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు

2 గంటల క్రితం

Special pujas to the Sirimanu tree
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, విజయనగరం కోట : ఉత్తరాంధ్ర సిరిమాను ఉత్సవాలను పురస్కరించుకొని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు అందరూకలిసి సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తొలి గంటు గొడ్డలతో వేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలను భారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ చేసి పునః ప్రతిష్ట అనంతరం తొలి ఉత్సవంగా రాష్ట్ర పండగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలను ఈ నెల 26న తోలేల్లు, 27న సిమాను ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిమాను తరలింపు జొన్నవలస నుంచి దుప్పాడ పాల్ నగర్ ఆర్ అండ్ బి జంక్షన్ ఎత్తి రోడ్డు రైల్వే స్టేషన్ సిఎంఆర్ కన్యకా పరమేశ్వరి గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తరలిస్తామని తెలిపారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి సిరిమాను సాంప్రదాయపద్ధంగా తయారు చేస్తారని తెలిపారు.

WhatsApp Image 2026-10-12 at 10.01.18 AM.jpeg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్